ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మోగాబ్రదర్‌ ..!

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో రోజుకో పాత్ర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆయనతో సంబంధం ఉన్న అన్ని పాత్రలను చూపించే పయత్నం చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. తాజాగా ఈ సినిమాలో ఎస్వీ రంగారావుగారి పాత్ర కోసం క్రిష్‌ మెగా బ్రదర్ నాగబాబును సెలెక్ట్ చేసుకున్నారని, నాగబాబు కూడా ఎస్వీఆర్ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నారని సమాచారం.

ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎస్వీఆర్ పాత్ర చాలా ముఖ్యమైంది. వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. అందుకే క్రిష్ ఆ రెండు పాత్రల నడుమ కొన్ని సన్నివేశాలని రూపొందించాలని భావిస్తున్నారట. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.