‘ఎన్టీఆర్‌’ లుక్‌

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్నికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమా షూటింగ్‌ను ఈ రోజు (గురువారం) నుంచి ప్రారంభించినట్లు దర్శకుడు క్రిష్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్‌ మొదటి సినిమా ‘మనదేశం’ లోని పోలీస్‌ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ఫొటోను పోస్ట్‌ చేసిన క్రిష్‌.. ‘నాడు, నేడు ‘మనదేశం’ తోనే చరిత్రకు శ్రీకారం అంటూ… ఎన్టీఆర్‌ రాసి పెట్టిన లెటర్‌ను జత చేశారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కీలక పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో శరత్‌ కేడ్కర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రంలో బాలయ్య 64 పాత్రల్లో కనిపించనున్నాడు. తెలుగు, హింది, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ భావిస్తున్నారు.