ఎన్టీఆర్ కథ మారుతుందా?

ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్‌. ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రాధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు మరో దర్శకుడు క్రిష్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర కథ మార్పు చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిని ఈ చిత్ర దర్శకుడు క్రిష్‌ తోసిపుచ్చారు. కథలో ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. కాకపోతే స్ర్కీన్‌ ప్లేలో స్వల్పంగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

బాలకృష్ణ అభిప్రాయం తర్వాతే ఏ నిర్ణయం అయినా ఉంటుందని క్రిష్‌ స్పష్టం చేశారు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌ అభిమానులు మెచ్చుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానన్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రంలోని నటీ,నటుల ఎంపిక జరుగుతోందని క్రిష్‌ చెప్పారు.