ఎన్టీఆర్ గారి సొంత నివాసంలో ‘ఎన్టీఆర్’ చిత్రీకరణ..!

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ పేరుతో బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను నటుడు దగ్గుబాటి రానా పోషించనున్నాడు. ఈ విషయం గురించి రానా మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ అబిడ్స్ లో ఉన్న ఎన్టీఆర్ గారి సొంత నివాసంలో జరుగుతోందని అన్నారు.

ఈ విషయాన్ని రానా ఓ ఆంగ్ల మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాలు, రాజకీయ ప్రయాణం, సమాజంపై, తెలుగు భాషపై ఆయనకున్న గౌరవాన్ని చూసి ముగ్దుడినయ్యాను. ఇప్పుడు ఆయన జీవితాధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నాకు నటించే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నా తొలి కాల్‌షీట్‌లో చిత్రీకరణ అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసంలో అని తెలియగానే మరింత ఎక్జైట్‌ అయ్యాను. ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు చరిత్రలోకి వెళుతున్నట్టు అనిపించిందని, ఆ ఇంట్లో ఎన్టీఆర్ గారి మేకప్ రూమ్ ఇప్పటికీ భద్రంగానే ఉందని, ఆ ఇంట్లో చిత్రీకరణ జరగడం జీవితంలో మర్చిపోలేని విషయమని అన్నారు. ఈ సినిమా కోసం తెలుగు పదాలను ఉచ్ఛరించడం, రాయడం నేర్చుకుంటున్నాను. అని తెలిపారు రానా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.