HomeTelugu Newsఎన్టీఆర్ పక్కన పూజా ఫిక్స్!

ఎన్టీఆర్ పక్కన పూజా ఫిక్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతోకాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతోంది. చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రంను నిర్మించనున్నారు.
pooja123 copy వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ.. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu