ఎన్టీఆర్ బయోపిక్ డేట్ వచ్చేసింది!

ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా దర్శకుడు తేజ బయోపిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. కళ్యాణ్ రామ్ కుమారుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో బాలయ్య 72 విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కృష్ణ, నాగేశ్వరరావు పాత్రలతో పాటు సినారె బాపు వంటి రచయితల పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పి.వి. నరసింహరావ్, ఇందిరాగాంధీ పాత్రలు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది జనవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.