ఎన్టీఆర్ విదేశీ హక్కుల కోసం పోటీ

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నట రత్ననందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్‌తో నిర్మితమౌతున్న ఎన్టీఆర్ బయోపిక్ విదేశీ హక్కులను దక్కించుకోవడానికి అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ఓ ప్రముఖ సంస్థ రూ. 12 కోట్లు ఆఫర్ చేసిందట. ఈ సినిమా ద్వారా బాలకృష్ణ మరో హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.

ఎన్టీఆర్ జీవితంతో సంబంధం ఉన్న ఎన్నో పాత్రలు ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించబోతున్నాయి. ఈ సినిమాలో అనేక పాత్రలున్నాయి. ఆయా పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటుంది, ఈ సినిమాలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకే విదేశీ హక్కుల కోసం సంస్థలు ఫోటీ పడుతున్నాయట. మరో సంస్థ ఎన్టీఆర్ బయోపిక్ విదేశీ హక్కుల కోసం రూ.13 కోట్లు ఆఫర్ చేసిందట. ఎన్టీఆర్ బయోపిక్ కు విదేశాల్లో డిమాండ్ పెరుగుతుండటంతో హక్కులు ఎవరికిస్తారో వేచి చూడాల్సిందే.