ఎన్టీఆర్ షాకింగ్ లుక్!

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ను ప్రేస్టిజియస్ గా తీసుకున్నాడు. ఈ సినిమాను దసరా నాటికి విడుదల చేయాలనేది ప్లాన్. ఈ సినిమాలో తారక్ కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. దీనికోసం ఇప్పటికే జిమ్ చేస్తోన్న ఎన్టీఆర్ తన శరీర బరువుని బాగానే తగ్గించుకున్నాడని సమాచారం. జిమ్ ట్రైనర్ పాయిడ్ స్టీవెన్స్ సూచనల మేరకు తన బాడీ షేప్ ను పూర్తిగా మార్చుకున్నాడట ఎన్టీఆర్.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో ఓ ఫోటో లీక్ అయ్యింది. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. క్యారక్టర్ డిమాండ్ చేస్తే ఫిజిక్ విషయంలో చేంజెస్ కంపల్సరీ. అందుకే తారక్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ మరీ సన్నిబడ్డాడని కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం.