ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిందట!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ చిత్రాల‌లో ఒక‌ప్ప‌టి హీరోయిన్స్ కు కీల‌క పాత్ర‌లు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే కోవలో తార‌క్‌, త్రివిక్ర‌మ్ సినిమాలోనూ ఇలా ఓ సీనియ‌ర్ హీరోయిన్ కు స్థానం ద‌క్కింద‌ని వార్తలు వచ్చాయి. ఆ మాజీ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. ల‌య‌. ‘స్వ‌యంవ‌రం’, ‘ప్రేమించు’ త‌దిత‌ర చిత్రాల‌తో పాపుల‌ర్ అయిన‌ ఈ అచ్చ తెలుగ‌మ్మాయి.. వివాహం త‌రువాత సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.
ఆమెను ఈ సినిమా కోసం ఎప్రోచ్ అయ్యారని, అయితే ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. తన కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని, తిరిగి యాక్టింగ్ అంటూ వెనక్కి వచ్చే ఇంట్రస్ట్ లేదని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ముఖ్యంగా యుఎస్ లో కుటుంబం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఆ పాత్రలో ఏ సీనియర్ హీరోయిన్ ను తీసుకుంటారో చూడాలి!