ఏపీలో రెండు రోజుల సంతాప దినాలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. నేడు (బుధవారం), రేపు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ రెండురోజులు అధికారిక వినోద కార్యక్రమాలు జరపరాదని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు.