ఐటెం సాంగ్ కు ఎంత తీసుకుందో తెలుసా..?

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండంగా, పూజాహెగ్డే ఐటెం సాంగ్ లో నటిస్తోంది. ‘జిల్ జిల్ జిగేల్’ అనే స్పెషల్ సాంగ్ లో పూజా కనిపించనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాటలో నటించడానికి పూజా రూ.50 లక్షలు తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.

గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించినందుకు కాజల్ పారితోషికంగా 50 లక్షలు తీసుకుంది. కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్ అంత తీసుకున్నప్పుడు పూజా కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తుండడం గమనార్హం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను ఏర్పాటు చేసి మార్చి 30న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.