ఒకే వేదికపై ముగ్గురు మెగా హీరోలు

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ అరంగేట్రం మూవీ విజేత.. ఈ మూవీ ద్వారా రాకాష్‌ శశి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..హర్షవర్దన్‌ రామేశ్వర్‌ సంగీతం సమకూరుస్తున్నాడు..ప్రస్తుతం ఈ మూవీ టాకీ పార్ట్‌ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది కళ్యాణ్‌ దేవ్‌ తన పాత్రకు డబ్బింగ్‌ కూడా పూర్తి చేశాడు.

ఈ మూవీ జులైలో విడుదలకానుంది. ఈ చిత్రాని కొర్రపాటి సాయి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకను ఈ నెల 24వ తేదిన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా ఆయనతో పాటే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడ హాజరుకానున్నారు.