ఓంకార్ రూటు మార్చాడు!

యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ రియాలిటీ షోలతో మరో మెట్టు ఎదిగాడు. దర్శకత్వంపై ఉన్న మక్కువతో టాలీవుడ్ లో తన టాలెంట్ చూపించుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన డైరెక్ట్ చేసిన రాజు గారి గది సిరీస్ మంచి విజయాలను అందుకున్నాయి. త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓంకార్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టి ఓంకార్ మళ్ళీ టీవీ షో చేయబోతున్నారని సమాచారం.
అసలు విషయంలోకి వస్తే ప్రముఖ టీవీ ఛానెల్ రియాలిటీ షో కోసం ఓంకార్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎలాగో బెల్లంకొండ శ్రీనివాస్ మొదలుకావడానికి సమయం ఉండడంతో ఈలోగా ఈ షో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట. ఈ షోకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది!