కంటెస్టెంట్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

 

బిగ్‌బాస్‌ సీజన్‌-2లో ఏదైనా జరగచ్చు అన్నట్లుగానే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు హోస్ట్‌ నాని. అయితే ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కొత్త సభ్యులు ఇంటిలోకి వస్తున్నారు అని అందరూ భావించారు.. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో పలువురు పేర్లు కూడా వినిపించాయి. కానీ ఈ వార్త’లు అన్నిటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ.. బిగ్‌బాస్‌ ఓ ప్రోమో రిలీజ్‌ చేశాడు.

‘ఇన్ని వారాలు మీ ఫేవరేట్‌ హౌస్‌ మేట్స్‌ను సేవ్‌ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఓటింగ్‌ లైన్స్‌ ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవుతాయని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలిమినేట్‌ అయిన హౌస్‌ మేట్స్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా తమకు అనుకూలంగా ప్రేక్షకులు ఓటేసేలా ప్రచారం మొదలుపెట్టారు.

 

CLICK HERE!! For the aha Latest Updates