కంపెనీ ప్రారంభించబోతున్న.. వర్మ

రక్తచరిత్ర, వీరప్పన్‌, వంగవీటి లాంటి చిత్రాలను తెరకెక్కించిన వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంఛలనానికి తెర తీశాడు. వర్మ మరో వివాదాస్పద చిత్రాని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. 1980లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహిం కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడు వర్మ. త్వరలో వర్మ బ్యానర్‌లో డి-కంపెనీ పేరుతో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన చేశాడు.

వర్మ బ్యానర్‌లో డి-కంపెనీ పేరుతో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సినిమా కోసం రిసెర్చ్‌ ప్రారంభించిన వర్మ 20 ఏళ్ల నాటి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని సినిమాగా కంటే వెబ్‌ సిరిస్‌గా తెరకెక్కిస్తేనే తగిన న్యాయం జరుగుతుందని వర్మ తెలిపాడు. ఈ వెబ్‌ సిరిస్‌ను బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెనతో కలిసి వర్మనే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ వెబ్‌ సిరిస్‌ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates