కట్ అవుట్ లో మాత్రం ఆ హీరోదే రికార్డ్!

ఇలయ తలపతి విజయ్.ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు.విజయ్ ని ఆరాదించడానికి ఆ ఫాన్స్ చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.యు ట్యూబ్ లో టీజర్ రికార్డ్ తమ హీరో పేరిటే ఉండాలని విజయ్ సినిమా టీజర్స్ అవి వచ్చినప్పడు ప్రత్యేకంగా ఒక ప్లానింగ్ ప్రకారం దానికి మిలియన్స్ కొద్దీ క్లిక్స్ తెప్పిస్తారు.ఈ మధ్యే విజయ్ సినిమాని కామెంట్ చేసిందని ఏకంగా ఒక జర్నలిస్ట్ వణికిపోయే రేంజ్ లో కూడా భయపెట్టారు.వాళ్ళ అభిమానాన్ని,ఉత్సాహాన్ని కంట్రోల్ చెయ్యడం విజయ్ చేతుల్లో కూడా లేదు.అయితే ఇప్పడు తమిళనాడులో దీపావళి కంటే పెద్ద పండుగగా మారింది విజయ్ కొత్త సినిమా మెర్సెల్ రిలీజ్.అక్కడ ఈ నెల 18 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ హడావిడి మామూలుగా లేదు.ఒక థియేటర్ దగ్గర ఏకంగా 150 అడుగులు కట్ అవుట్ ప్లాన్ చేసారు విజయ్ హార్డ్ కొర్ ఫాన్స్.దానికి పర్మిషన్ తెచ్చుకుని ఫిక్స్ చేసారు కూడా.

ఈ సినిమాకి బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించడంతో ఈ సినిమా సౌత్ ఇండియా రికార్డ్స్ ని తిరగరాస్తుందని ఫాన్స్ నమ్మకం.పైగా విజయ్ కి ఇంతకుముందు భారీ తెరి రూపంలో 100 సినిమాను అందించిన అట్లీ డైరెక్ట్ చెయ్యడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమాని అదిరింది పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.సమంత,కాజల్,నిత్య మీనన్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తుండడం విశేషం.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ 200 కోట్లు కొల్లగొడుతుందని ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి.స్పైడర్ తో విలన్ గా విశ్వరూపం చూపించిన ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కూడా బ్యాడీ గా అదరగొట్టబోతున్నాడు.