కథ కోసం కోట్లు!

సినిమాకు కథ అనేది చాలా ముఖ్యం. స్టార్ హీరో ఉన్నా సరే.. అందులో కంటెంట్ లేకపోతే ఇంక అంతే సంగతులు. కథలో సత్తా ఉంటేనే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పుడు అలంటి కథ కోసమే ఒక హీరో ఏకంగా కోట్లు కుమ్మరించాడని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ వంటి సినిమాలకు కథలను సమకూర్చిన రచయిత విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు స్టార్ హీరోలకు కథలను అందిస్తున్నాడు. అలానే రాజమౌళి సినిమాకు కథను సిద్ధం చేస్తున్నాడు. తాజాగా మంచు విష్ణు కోసం ఓ కథను రెడీ చేసి ఇచ్చాడని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించాడు. ఈ కథ కోసం ఆయన రెండు కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. కానీ దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం విష్ణు ఈ కథను డైరెక్ట్ చేసే హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. త్వరలోనే సినిమాను ప్రారంభించాలనేది ఆలోచన.