కన్నడ సూపర్‌ స్టార్‌తో అనుపమ

ప్రేమమ్‌ తో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్‌ ఆ తరువాత తెలుగు, తమిళం మూవీలు చేస్తున్నది.. తాజాగా ఆమె నటించిన ‘తేజ్‌ ఐ లవ్ యు’ చిత్రం జులై 6వ తేదిన విడుదల కానుంది.

తాజా గా తెలుగులో మరో రెండె మూవీలకు సైన్‌ చేసింది. ఇప్పుడు ఆమె కన్నడంలోకి అడుగుపెడుతున్నది. అది కూడ కన్నడంలో సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ సరసన కావడం విశేషం. రాజ్‌ కుమార్‌ చేయనున్న ‘నట సౌర్వభౌమ’ చిత్రంలో అనుపమ కథానాయకిగా నటించనుంది. మాస్‌ ఎంటర్టైనర్‌గా రూపొందునున్న ఈ చిత్రాని పవన్‌ వడయార్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ్‌లో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్న అనుపమ ఇప్పడు కన్నడలో ఎంట్రీ ఇచ్చి ఎలా అదరగొడుతుందో వేచి చూడాలి.