కన్నుగీటుకే కోట్లు!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అయిన బ్యూటీ ప్రియా వారియర్. కన్నుకొట్టి
లక్షలాది మందిని తన అభిమానులుగా మార్చుకుంది. స్టార్ హీరోలు సైతం ఈమెకు ఫిదా అయిపోయారు. ఆమె క్రేజ్ ఆమె నటిస్తోన్న ‘ఒరు అడార్ లవ్’ సినిమాకు కూడా ఏర్పడింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నారు. ఇద్దరు నిర్మాతలతో కలిసి రెండు కోట్ల రూపాయలకు ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ లో మంచి పోటీ ఏర్పడింది. ఏషియన్ సురేష్ ఈ రైట్స్ దక్కించుకోవాలని చాలానే ప్రయత్నించాడట. కానీ ఆయన కంటే లగడపాటి ఎక్కువ డబ్బు ఆఫర్ చేయడంతో ఆయనకే ఈ హక్కులు దక్కాయి. ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేని ఓ మలయాళ సినిమాను ఈ రేంజ్ లో తెలుగులో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.