“కన్నుల్లో నీ రూపమే” ఆడియో సక్సెస్‌ మీట్‌

ఎ.ఎస్‌.పి క్రియేషన్స్‌ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్‌ బాసాని నిర్మాతగా, బిక్స్‌ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం “కన్నుల్లో నీ రూపమే”. ఈ చిత్రం ఈ నెల 29వ తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆడియో సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత “సిందూర పువ్వు” కృష్ణారెడ్డి గారు, చిత్ర యూనిట్‌ సభ్యులు మహేశ్వర్‌ రెడ్డి. భాస్కర్‌ మన్యం, డైరెక్టర్‌ బిక్స్‌ ఇరుసడ్ల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాకేత్‌, కెమెరామెన్‌ విశ్వ సుభాష్‌, నిర్మాత భాస్కర్‌ బాసాని, యు.రామ్మోహన రావు ఇప్పిలి తదితరులు పాల్గొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ మాట్లాడుతూ ఈ చిత్రానికిపనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా కథ విని చాలా ఇంప్రెస్ అయ్యానని, దర్శకుడు తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడని బిక్స్ అనుభవమున్న దర్శకుడిలా చిత్రాన్ని రూపొందించారని ఈ చిత్రంలో నేనూ భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. 29న కన్నుల్లో నీరూపమే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని దర్శకుడు బిక్స్ అన్నారు.