కమల్ పై గౌతమి ఆరోపణలు!

కమల్ హాసన్ నటి గౌతమి కొన్నేళ్ళపాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ కొన్ని అభిప్రయాభేదాల కారణంగా వేరుపడ్డారు. కొన్నాళ్ళకు ఇద్దరూ తమతమ జీవితాలలలో బిజీ అయిపోయారు. కమల్ హసన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తన పార్టీ పేరుని కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ప్రత్యర్ధులు కమల్ పై ఎప్పుడు కామెంట్ చేద్దామా..? అని ఎదురుచూస్తుంటే వారికొక మంచి టాపిక్ గౌతమి రూపంలో దొరికింది. రీసెంట్ గా గౌతమి.. కమల్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
గతంలో ఆమె కమల్ పని చేసిన చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. అయితే ‘దశావతారం’ సినిమా సమయం నుండి కమల్ తనకు చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టారని డబ్బులు అడిగితే అసలు ఆ ఊసే తీసుకురావడం లేదని చెబుతోంది. ఇన్నాళ్ళు ఈ విషయంపై మాట్లాడని గౌతమి ఇప్పుడు మాట్లాడుతుండడంతో ఈ విషయాలు తెరపై వచ్చాయి. దీంతో కమల్ ప్రత్యర్ధులు గౌతమికే బాకీ పడ్డారంటే ఇంక జనాలకు ఏం మేలు చేస్తారని అంటున్నారు.