కమల్, విక్రమ్ తో నితిన్!

కమల్, విక్రమ్ కలిసి చేస్తున్న ఓ సినిమాలో నితిన్ సైతం ఓ క్యారక్టర్ వేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కమల్, విక్రమ్ లు తమ సినిమాకు లోకల్ తెలుగు స్టార్ హీరో నితిన్ లాంటి వాడు తోడైతే ఇక్కడ మార్కెట్ కు కలిసి వస్తుందని, బిజినెస్ పరంగానూ, ఓపినింగ్స్ పరంగానూ ప్లస్ అవుతుందని భావించినట్లు సమాచారం. నితిన్ సైతం..తనకు వీళ్ల సినిమాలో నటించటంతోతమిళంలో ప్లస్ అవుaతుందని ఓకే అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. కమల్ తన సొంత రాజ్‌ కమల్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై విక్రమ్‌ తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. రీమేక్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించనున్నాడట. ఓ ఫ్రెంచ్‌ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చీకటిరాజ్యం ఫేం రాజేష్‌ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే రీమేక్‌ రైట్స్ తీసుకున్న చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విక్రమ్‌ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.