కమల్ హీరోయిన్ తో రాజశేఖర్..!

కమల్ హీరోయిన్ తో రాజశేఖర్..!
పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలలో నటించిన పూజా కుమార్ మొన్నమధ్య కమల్ తో ‘విశ్వరూపం’, 
‘ఉత్తమవిలన్’ వంటి చిత్రాల్లో నటించింది. గ్లామర్ పరంగా అమ్మడుకి మంచి మార్కులే పడ్డాయి. 
ఇప్పుడు ఈ భామను రాజశేఖర్ తన సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్. రాజశేఖర్
హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 
హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ రాజశేఖర్ అనేసరికి ఎవరు నటించడానికి 
ముందుకు రాలేదు. ప్రియానంద్ ను సంప్రదించగా అమ్మడు కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. 
దీంతో చేసేదేమీ లేక హీరోయిన్ వేటలో పడ్డారు. ఆ నేపధ్యంలో పూజా కుమార్ ఈ సినిమాలో 
హీరోయిన్ నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు పూజా స్ట్రెయిట్ తెలుగు సినిమా 
చేయలేదు. ఇదే తనకు తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ 
గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ 
సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 
CLICK HERE!! For the aha Latest Updates