కలర్స్‌ స్వాతి, వికాస్‌ల పెళ్లి వేడుక

బుల్లితెరపై కలర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పరిచయమై డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, హీరోయిన్‌గా మారి.. కలర్స్‌ స్వాతి గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇప్పుడు శ్రీమతిగా మారింది. మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో స్వాతి వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది.

వీరిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ జంట ఒక్కటయ్యింది. సెప్టెంబర్‌ 2న కొచ్చిలో వివాహ విందు ఇవ్వనుంది. అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.