కల్యాణ్‌ దేవ్ రెండోవ చిత్రం హరీశ్ శంకర్‌ తో!

మెగాస్టార్‌ చిన్నఅల్లుడు కల్యాణ్‌దేవ్ తొలి సినిమా “విజేత” సాయి కొర్రపాటి నిర్మాణంలో రూపొందింది. ఈ సినిమా జూలై 12న భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, రెండవ చిత్రంతో సెట్స్‌పైకి వెళ్లడానికి కల్యాణ్ దేవ్‌ రెడీ అవుతున్నట్టు సమాచారం.

తొలి సినిమాకు పెద్దగా గ్యాప్‌ లేకుండానే రెండో సినిమా షూటింగ్‌ మొదలు పెట్టాలనే ఆలోచనలో మెగా ఫ్యామిలీ ఉంది. కల్యాణ్‌ దేవ్‌ రెండో సినిమాకి దర్శకుడిగా హరీశ్‌ శంకర్‌ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఆల్రెడీ హరీశ్‌ శంకర్‌ కి కబురు వెళ్లడం..ఆయనతో చర్చలు జరగడం పూర్తయ్యాయని అంటున్నారు. కల్యాణ్‌ దేవ్‌ కోసం కథ రెడీ చేసే పనిలో హరీశ్‌ వున్నాడట. కథతో చిరూను ఎంతవరకు ఒప్పిస్తాడో చూడాలి మరి.