కళాతపస్వి కే విశ్వనాథ్‌ ‘విశ్వదర్శనం’

సినీ ఇండస్ర్టీలో ఇప్పడు బయోపిక్‌ల హవా నడుస్తుంది. తెలుగులో ఈ ప్రస్థానం మహానటితో మొదలైంది. ఆ తరువాత వరుసగా బయోపిక్‌లు రూపొందుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌, యాత్ర చిత్రాలు సెట్స్‌ పై ఉండగా మరో నాలుగైదు బయోపిక్‌ చిత్రాలను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కోవలో తాజాగా ‘విశ్వదర్శనం’ కూడా చేరింది. లెజెండరీ డైరెక్టర్‌ కే విశ్వనాథ్‌ బయోపిక్‌ ‘విశ్వదర్శనం’ కావడం విశేషం.

తెలుగునాట అజరామరమైన చిత్రాలను ఎన్నింటినో అందించిన మహనీయుడు కళాతపస్వి కే విశ్వనాథ్‌. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను , రివార్డులను పొందిన దర్శకుడు.ఈ బయోపిక్‌ నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. విశ్వనాద్ పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు.