కాంతారావు బయోపిక్ ‘అనగనగా ఓ రాకుమారుడు’

అలనాటి జానపద చిత్రాల రారాజు కాంతారావు. జానపద కధా చిత్రాలలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న నటుడు కాంతారావు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలలోను ఎన్నో కీలకమైన పాత్రలను పోషించారు. ఇప్పుడు కాంతారావు జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందనుంది…ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఆదిత్య కాంతారావు సొంత ఊరు అయిన కోదాడ మండలం “గుడిబండస” వెళ్ళారు.

కాంతారావు కుమారుడు ప్రతాప్‌ నుంచి ఆయన సన్నిహితులు నుంచి కొన్ని వివరాలను సేకరించారు. ఇక ఈ మూవీకి “అనగనగా ఓ రాకుమారుడు” టైటిల్‌ ఖరారు చేసినట్లు ఆయన తెలిపాడు…ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, ఎన్నార్‌, కృష్ణకుమారి, రాజశ్రీ, విఠలాచార్య తదితర పాత్రలు ఉంటాయని ఆయన తేలియజేశారు.