కాజల్ అసలు తగ్గట్లేదుగా!

అప్పటివరకు అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ కాజల్ అగర్వాల్ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో వరుస అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. సీనియర్ హీరోలంతా కాజల్ ను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆమె డిమాండ్ పెరిగిపోవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది ఈ బ్యూటీ. సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తీసుకునే కాజల్ కోటి నుండి రూ.1.25 కోట్లను తీసుకోవడం మొదలుపెట్టింది. రీసెంట్ గా మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా రూ.1.75 కోటి కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.నిజానికి హీరో, హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో మొదట్లో కాస్త బెట్టు చేసినా.. నిర్మాతలకు రాయితీ ఇస్తుంటారు. కానీ కాజల్ మాత్రం బేరాలు లేవని తేల్చి చెప్పేస్తుందట. అడిగినంత ఇస్తేనే నటిస్తానని దర్శకనిర్మాతలు చెబుతోందట. ఇటీవల ఓ యువ హీరో సినిమాలో నటించమని సంప్రదిస్తే రెండు కోట్లు డిమాండ్ చేసి నిర్మాతలను భయపెట్టేసింది. ఇకపై కూడా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గకూడదని నిర్ణయించుకుందట. మొత్తానికి కాజల్ తనకున్న డిమాండ్ ను బాగానే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుంది.