కాపు రిజర్వేషన్లకు కేంద్రంతో పోరాటమే: చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం వద్ద 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న కాపు రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ వైఖరిని కూడా నిలదీయాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌కు కేసుల మాఫీ తప్ప మరో ధ్యాస లేదని ఆరోపించారు. దళితులు, మైనారిటీలు దూరమైన బీజేపీతో వైఎస్ జగన్ కలిసిపోయారని అన్నారు. కడప ఉక్కు తరహాలో విశాఖ రైల్వేజోన్ అంశంపైనా పోరాడాలని అన్నారు.