కార్తీ ‘చినబాబు’ మూవీ ట్రైలర్‌

కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చినబాబు’. అఖిల్‌ హీరోయిన్‌ సాయేషా సైగల్‌ కథానాయిక. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తీ రైతు పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ టీజరును చిత్ర యూనిట్‌ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ టీజర్‌ను సూర్య విడుదల చేస్తూ ‘తమ్ముడు కార్తీ ‘చినబాబు’ టీజర్‌ను విడుదల చేయడం చాలా గర్వంగా ఉంది అంటూ’ సూర్య ఈ ప్రచార చిత్రాన్ని ట్వీటర్‌లో పెట్టారు.

ఈ టీజర్‌ ‘పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే. నువ్వు రైతువైతే కాలర్‌ ఎగరేసుకు తిరుగు అంతే’ అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. కార్తీ మాస్‌ లుక్‌లో, పంచెకట్టుతో కనిపించారు. ‘ఒక్కొక్కళ్లకు ఒక్కొక్కదాని మీద పిచ్చి, నాకు నా కుటుంబం మీద పిచ్చి’ అంటూ సత్యరాజ్ కనిపించారు. ‘జమ చేసుకున్నది ఏదైనా ఖర్చు అవుతుంది, ఖర్చుకాని జమ బంధుత్వమే’ అని కార్తీ చేప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘వేసేయక తప్పదా మామయ్య’ అని అడిగితే కార్తీ.. ‘వేసేయాలి అనుకుంటే చేసయాలంతే’ అంటూ ఫైట్‌ చేయడం మొదలు పెట్టడం ఆకట్టుకుంటోంది.