‘కాలా’కు భారీ డిమాండ్!

రజనీ కాంత్, పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కాలా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ మూవీ కు మంచి క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ పూర్తైంది. ఈ సినిమాకు వచ్చిన శాటిలైట్ రేటు చూసి అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధనుష్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ వారు 125 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు భారీస్థాయిలో పోటీ ఏర్పడిందట.తాజాగా స్టార్ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల హక్కులను కలుపుకుని, ఈ ఛానల్ వారు 75 కోట్లను చెల్లించినట్టు సమాచారం. ఈ రేటు రజనీకి గల క్రేజ్ ను మరోమారు చాటిచెప్పిందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటి ఈశ్వరి రావ్ రజనీకి భార్యగా నటిస్తుంది.