‘కాలా’ని కొనేవారేలేరా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈరోజు సినిమా టీజర్ విడుదల కావాల్సివుంది కానీ కొన్ని కారణాల వలన టీజర్ రిలీజ్ ను రేపటికి వాయిదా వేశారు. రజినీకాంత్ తో ‘కబాలి’ సినిమాను రూపొందించిన దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను కూడా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. కోలివుడ్ లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగులో ఆశించినంత బజ్ రావడం లేదు. దీంతో సినిమా థియేట్రికల్ రైట్స్ తక్కువ మొత్తానికి అడుగుతుండడంతో నిర్మాతలు సంతృప్తిగా లేరని సమాచారం.
టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలు ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడానికి రూ.౩౦ నుండి ౩౩ కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చిత్రనిర్మాతలు రూ.40 కోట్లకు తక్కువ ధరకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. అంత మొత్తం చెల్లించడానికి టాలీవుడ్ నుండి ఎవరు ముందుకు రావడం లేదని సమాచారం. సినిమా టీజర్ విడుదలైన తరువాత అనుకున్న మొత్తానికి సినిమా అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు చిత్రనిర్మాతలు. మరి ‘కాలా’ తెలుగు రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి!