కాస్టింగ్‌ కౌచ్‌ పై కాజల్ స్పందన

కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంలో నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ ఇండస్ర్టీల్లో ప్రముఖల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ… రోజు ఎవరో ఒకరి పేరు వెల్లడిస్తూ.. వార్తల్లో నిలుస్తుంది. శ్రీ రెడ్డి తో పాటు నటి మాధవి లతా వంటి నటీమణులు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతున్నారు. తాజగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కాస్టింగ్ కౌచ్ కు సంబందించిన ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది.

నా అదృష్టం కొద్దీ అలాంటి చేదు అనుభవాలు నాకు ఎదురు కాలేదు. అసలు కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందొ లేదో కూడా తెలియదు అని కాజల్ వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పడం కంటే మగాళ్లకు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి అని కాజల్ అగర్వాల్ బదులిచ్చింది. గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని వెల్లడించిన సమయంలో శ్రీరెడ్డి తీవ్రమైన విమర్శలు చేసింది. కాజల్ అగర్వాల్‌ పై శ్రీరెడ్డి ఎలాంటి విమర్శలు చేస్తుంది అనే విషయం చర్చనీయ అంశంగా మారింది.