కింగ్‌ పుట్టిన రోజుకు అఖిల్‌ ఇవ్వనున్న గిఫ్ట్ ఇదేనా!

అక్కినేని నట వారసుడు అఖిల్‌ తన కెరీర్‌లోమూడో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగురుతుంది. ఆగస్టు 14 నాటికి ఈ చిత్రం 70 శాతం చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా అఖిల్‌ త్రండి కింగ్‌ నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 29వ తేదీన ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాలని మూవీ యూనిట్‌ అనుకుంటుంది. అదే రోజు ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు.