కిడ్నాప్‌ చేస్తానంటున్న సమంత

‘రంగస్థలం’ లోని ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు’ ఈ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాలో ఈ పాటకు సమంత, రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. చాలా మంది నెటిజన్లు ఈ పాటకు పేరడీలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీటిలో తనకు ఎంతో నచ్చిన కొన్ని వీడియోలకు సమంత రిప్లై కూడా ఇచ్చారు.

తాజాగా ఓ చిన్నారి ‘రంగమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్ లో షేర్‌ చేశారు. ‘ఈ వీడియోను ఒక్కసారి చూసి ఊరుకోలేరు, మళ్లీ చూడాలని అనిపిస్తోంది’ అంటూ సమంత, అనసూయ, సుకుమార్‌ ట్యాగ్‌ చేశారు. బుడ్డోడి డ్యాన్స్‌కు సమంత ఫిదా అయ్యారు. ‘సరే..ఈ క్యూటీని నేను కిడ్నాప్‌ చేస్తా’ అంటూ లవ్‌ సింబల్స్‌ను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు బుజ్జిగాడి డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ అయిపోయారు.

సమంత ప్రస్తుతం ‘యూటర్న్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. దీంతోపాటు ‘సూపర్‌ డీలక్స్‌’ ‘సీమ రాజా’ అనే తమిళ చిత్రాల్లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ సినిమాను రూపోందిస్తున్నారు.