కీర్తి సురేష్-శివకార్తికేయన్-సమంత “సీమరాజా”

తమిళంలో హిట్ ఫెయిర్‌గా పేరుతెచ్చుకున్న శివకార్తికేయన్-కీర్తి సురేష్. ఈ జంట తాజాగా మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రజనీ మురుగన్, రెమో చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. వీళ్లిద్దరిది హిట్ ఫెయిర్ మాత్రమే కాదు.. సూపర్ హిట్ ఫెయిర్. అంతే కాకుండా కీర్తి సురేష్ నటి సమంతతో కలిసి రెండోసారి నటించబోతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించారు.

పొన్‌రామ్ దర్శకత్వంలో 24 ఏఎం స్టూడియో సంస్థ అధినేత ఆర్‌డీ రాజా నిర్మిస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో సిమ్రాన్, సూరి, నెపోలియన్ తదితరులు నటిస్తున్నారు. సీమరాజా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.