కుర్ర హీరోలకు వార్నింగ్ ఇచ్చిన.. చిరు!

మెగా స్టార్ వరుసగా అందరి కుర్ర హీరోలకు వార్నింగ్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ లో టాక్ .ఒక సినిమా రిజల్ట్ చాలా వరకు సమయాన్ని బట్టి తేడా వస్తుందని సినిమా వాళ్లు అనుకుంటుంటారు. నిజంగా అది నిజమే . పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్స్ క్లాష్ కంటే టాక్ క్లాష్ ఎక్కువగా జరుగుతుంది. దీంతో సినిమాలు రిజల్ట్ లో చాలా తేడా వస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని సార్లు కలెక్షన్స్ దెబ్బతీస్తాయి. అందరు హాలిడేస్ ని టార్గెట్ చేయడం కామన్ అయిపొయింది. అయితే ఈ తరహా పద్ధతి మారాలని సినీ పెద్దలు కోరుకుంటున్నారు.

పెద్ద హీరోల విషయంలో అయితే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలే ఒకే మూమెంట్ లో పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ – కళ్యాణ్ దేవ్ సినిమాలు కూడా ఒకే సారి వస్తుండడంతో ప్రస్తుతం ఆ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే మెగా యువ హీరోలకు ఆలోచన కలిగేలా మెగాస్టార్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట.

ఇక నుంచి నిర్మాతలతో ముందే ఓ మాట అనుకుని ప్లాన్ చేసుకోవాలని చెప్పారట. అలాగే మరికొంత మంది స్టార్ హీరోలతో కూడా మెగాస్టార్ ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎప్పుడైనా సరే కథల ఎంపిక విషయంలో ప్రయోగాలలో పోటీని ఇవ్వాలి గాని ఇలా ఒకేసారి రిలీజ్ చేసి నష్టపోయే విధంగా చేసుకోకూడదని చెప్పారట. అన్ని సినిమాలు మంచి లాభాలతో ఆడాలి కానీ బయ్యర్స్ కి నష్టాలను కలిగించకూడదు అని వివిధ రకాల ఉదాహరణలు తెలియజేశారు.