కూరగాయలను విక్రయిస్తున్న సమంత..!

ప్రముఖ నటి సమంత చెన్నై నగరంలోని తిరువళ్లిక్కేణి ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయించారు. ఇక్కడి ప్రసిద్ధి చెందిన జాంబజార్‌ మార్కెట్‌లో ఓ కూరగాయల దుకాణం వద్దకు చేరుకున్న ఈ అమ్మడు ఓ మహిళా వ్యాపారిని కలిసి కూరగాయలు విక్రయించాలన్న తన కోరికను వివరించారు. ఆమె వెంటనే అంగీకరించడంతో దుకాణంలో కూర్చున్న సమంత కూరగాయల ధరలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. విషయం తెలిసిన వేంటనే వినియోగదారులు భారీ ఎత్తున గుమిగూడి సమంత చేతుల మీదుగా కూరగాయలు కొనుగోలుచేసి తీసుకెళ్లారు.

దీంతో కొద్ది సేపట్లోనే దుకాణంలోని కూరగాయలన్నీ చక చకా అమ్ముడుపోయాయి. విషయం ఏమిటంటే.. సమంత సినిమాలో నటించడంతోపాటు సమాజ సేవ కూడా చేస్తుంటారు. ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో నటి సమంత అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం కోసం నిధులను సేకరిస్తున్నారు.