కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!

కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!
ప్రస్తుతం ఉన్న యువ హీరో, హీరోయిన్లతో లెజండరీ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 
అదే ‘నక్షత్రం’. సినిమా టైటిల్ తెలిసినప్పటినుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. వీరితో పాటు సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు. 
కానీ కేవలం 20 నిమిషాలు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తాడు. పోలీస్ పాత్రలో తేజు కనిపించనుండగా 
ఆయనకు జంటగా లేడీ పోలీస్ ఆఫీసర్ గా ప్రగ్యాజైస్వాల్ ను ఎన్నుకున్నారు. కంచె సినిమాతో యూత్ 
లో క్రేజ్ సంపాదించుకున్న ప్రగ్యకు ఈ సినిమాలో ఛాన్స్ రాగానే వెంటనే ఒప్పేసుకుందట. హీరోయిన్స్ 
ను కృష్ణవంశీ ఎంత అందంగా చూపిస్తాడో.. అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అమ్మడుకి మంచి 
బ్రేక్ వస్తుందని ఆశిస్తుంది. సినిమాలో ప్రగ్య రెండు యాక్షన్ సీన్స్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. 
ఈ సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం ఖాయం!
CLICK HERE!! For the aha Latest Updates