‘కృష్ణార్జున యుద్ధం’ టీజర్ టాక్!

వరుస విజయాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ”ఏడుండార్రా గోపికలు.. నూడిల్స్ చేయడానికి నువ్వు అమ్మాయిల్ని పడేయడానికి ఒకటే టైమ్ పడుతోంది ఎలారా? అవతలి వాళ్లను మనం ఎంత కోరుకుంటున్నామో.. అది మన కళ్లల్లో వారికి కనపడాలి. ఇట్ షుడ్ హార్డ్ లైక్ ఏ సైక్లోన్.. ఆడోళ్లు భలే కఠినాత్ములు..” అంటూ సాగుతుంది టీజర్.
నాని డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కృష్ణ పాత్రలో ఊర‌మాస్‌గా అల‌రించ‌నున్న‌ నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా సంద‌డి చేయ‌నున్నాడు.