కొడుక్కి నామకరణం చేసిన ఎన్టీఆర్‌

జూన్‌ 14 వ తేదిన జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిన్నారి ఫొటోను అభిమానుల కోసం తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఎన్టీఆర్‌ ఇప్పుడు తాజాగా చిన్నారి పేరును కూడా షేర్‌ చేశారు. తమ కొడుక్కి “భార్గవ రామ్‌” అని పేరు పెట్టారు ఎన్టీఆర్, ప్రణీత దంపతులు‌. వీరికి మొదటి కొడుకు పేరు అభయ్ రామ్‌.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ అరవింద సమేత షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో అలరించనున్నారు.