కొణిదల ప్రొడక్షన్స్ లో యంగ్ హీరోలు!

ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త దర్శకులను, హీరోలను ప్రోత్సహించడానికి చాలా మంది సొంత బ్యానర్లను స్థాపిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పేరిట పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ను స్థాపించడమే కాకుండా.. నితిన్ తో ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

ఇక రామ్ చరణ్ కూడా తన బాబాయ్ రూట్ లో కొణిదల ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ను స్థాపించి చిరంజీవి 150వ చిత్రాన్ని
నిర్మిస్తున్నాడు. అయితే కేవలం తమ కుటుంబంలోని హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా యంగ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

శర్వానంద్, అక్కినేని అఖిల్ లతో సినిమాలు చేయడానికి చరణ్ సిద్ధపడుతున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన కథలు కూడా ఫైనల్ అయినట్లు టాక్. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు హీరోగా, నిర్మాతగా చరణ్ డబుల్ యాక్షన్ కు రెడీ అయిపోతున్నాడు.