‘కొబ్బరిమట్ట’ త్వరలోనే విడుదల

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు డిఫరెంటె టైటిల్స్‌తో ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. కొన్నాళ్ల క్రితం హృదయ కాలేయం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంపూ చాలారోజులకు ఇప్పుడు మళ్లీ ‘కొబ్బరిమట్ట’ తో రానున్నాడు. ఈ సినిమాను నాలుగేళ్ల కిత్రంమే మొదలు పెట్టినా పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఇటేవలే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు తాము రెడీ అంటూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ పోస్టర్‌లో ‘కొబ్బరిమట్ట’ సినిమా తొలివారం ఎక్స్‌పెక్టెడ్‌ గ్రాస్‌గా 233.64 కోట్లు అని సరదగా ప్రకటించారు. ఈ పోస్టర్‌ బాగా వైరల్‌ అయింది. టైటిల్‌తో ఇప్పటికే చాలా వరుకు పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ సినిమా ఇక పోస్టర్‌తో మరింతగా ప్రేక్షకులకు చేరువైంది.తాజాగా సంపూ ఈ చిత్రం గురించి ట్వీట్‌ చేశాడు. “చివరకు..మేము రెడీ.. సంవత్సరంన్నర కష్టం..కష్టం అనేది చిన్నమాట..ఈ సినిమాను నిర్మించడానికి నారక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశాను. రిలీజ్‌ డేట్‌ కోసం రెడీగా ఉండండి” అంటూ సంపూ ఆ ట్వీట్‌ ద్వారా తెలిప్పాడు.