కొరటాల కామెంట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం!

‘భరత్‌ అనే నేను’ టీజర్‌లో బాగా పాపులర్ అయిన ఓ డైలాగ్ .. ”చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అని..” మహేష్ చెప్పే డైలాగ్ ఉంది. ఆ డైలాగుని పట్టుకుని..మోడీ పై సోషల్ మీడియాలో కొరటాల శివ ఓ కామెంట్ చేసారు. అది ఇప్పుడు సంచలనం అవుతోంది. ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసిన వెంటనే మోదీపై సోషల్‌మీడియాలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రియాక్ట్ అయ్యారు. అందరం కలిసి ప్రధాని మోదీని మనిషిని చేసి గతంలో ఆయన చేసిన ప్రామిస్‌ను గుర్తు చేద్దాం అంటూనే రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోనే ఉన్నాయని గుర్తించండి సార్? అని ముగించాడు.

ఈ విషయమై మోదీ అభిమానుల మాత్రం మండిపడుతున్నారు. ప్రధాని మోడీ ని విమర్శించేవాడివా.. పరిస్దితులు గమనించుకుని మాట్లాడమంటూ సోషల్ మీడియాలో కౌంటర్స్ వేస్తున్నారు. అయితే అదే సమంయలో చాలా మంది కొరటాల శివను అభినందిస్తున్నారు. ఈ ప్రభావం ఆయన తాజా సినిమా పై పడుతుందా అంటే.. అంత లేదని అంటున్నారు. ఇది కేవలం సినిమా ప్రమోషన్ లో భాగమే అంటున్నారు.