చికిత్సకోసం జుట్టు కత్తిరించుకున్న సొనాలీ

ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో పంచుకున్న సోనాలి.. తాను ఒంటరిని కాదంటూ వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఆమె మనోధైర్యానికి సెలబ్రిటీలు జేజేలు కొట్టగా, ప్రతి ఒక్కరికి రిప్లై ట్వీట్స్ తో థాంక్స్ చెప్పింది. ఇక క్యాన్సర్ అంటే కీమో థెరపీ తప్పనిసరి కాబట్టి ఆ సమయంలో రేడియేషన్ వల్ల తలపై జుట్టు రాలిపోవడం సహజమే. ఇందుకోసం ఆమె జుట్టును చిన్నగా ఉంచాలనే నెపంతో కత్తిరిస్తున్నారు. ఈ వీడియోను సోనాలి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నాకు సపోర్ట్ గా ఉన్నందుకు అందరికి ధన్యవాదాలు అని తెలిపింది.