క్రిష్ కు ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు!

ఎన్టీఆర్ బ‌యోపిక్ తెరకెక్కుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. కొన్ని రోజులు క్రిత‌మే లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు
తేజ ద‌ర్శ‌క‌త్వం చేయాల్సుంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తేజ కొన్ని కార‌ణాల చేత త‌ప్పుకున్నాడు. ఇప్పడు ఆ
బాద్య‌త‌ను క్రిష్ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా క్రిష్‌కే ఓటేసిన‌ట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా
ఈ విష‌యాన్ని వెల్ల‌డించే అవకాశముంది. ఎన్టీఆర్ పాత్ర‌లో తనయుడు బాల‌కృష్ణ క‌నిపించ‌నున్న విష‌యం మ‌న‌కు
తెలిసిందే.

ప్ర‌స్తుతం దర్శకుడు క్రిష్ కంగ‌నా సినిమా మ‌ణిక‌ర్ణిక తో బిజీగా ఉన్నారు. జులైలో ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. తర్వాత
ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌నులు మొదలుపెట్టే అవకాశముంది. రెగ్యులర్ షూటింగ్ ద‌స‌రా త‌రువాత మొద‌లుపెట్టి వ‌చ్చే
స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాల‌య్య కూడా వీవీ
వినాయ‌క్ తో చేస్తున్న మూవీలో బిజీగా ఉన్నారు.