గడుగ్గాయి పాత్రలో నిహారిక..!

మెగా డాటర్‌ నిహారిక.. ఒక మనసు సినిమా ద్వారా వెండితెర పై తెరంగేట్రం చెసింది. ఈ సినిమా అంత సక్సెస్‌ కాలేకపోయినా.. తన నటనతో మెగా అభిమానులను నిహారిక ఫిదా చేసింది. ఇప్పడు రెండో ప్రయత్నంగా హ్యాపీ వెడ్డింగ్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ద్వారా నిహారిక కమర్షియల్‌ గా కూడా తనతో సినిమాలు చెయ్యొచ్చు అని నిరూపించుకుంది. నిహారిక వెండితెర కంటే ముందు బుల్లితెర పై అలరించింది. అంతేకాక ఈమె ముద్దపప్పు ఆవకాయ్‌ అనే వెబ్‌ సీరీస్‌లో నటించింది. ఆ వెబ్‌ సీరీస్‌ దర్శకుడు ప్రణీత్‌తో నాన్న కూచి అనే వెబ్‌ సీరీస్‌ కూడా చేసింది. ఇందులో నాగబాబు కూడా నటించారు. ప్రణీత్‌ వర్క్‌ నచ్చడంతో నిహారిక అతనితో సినిమా చేయడానికి సిద్ధమౌతుందట. కాగా ఆ సినిమా సూర్యకాంతం అనే పేరుతో రానుందట.

సూర్యకాంతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది అత్త పాత్ర. సినిమాల్లో సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్రల్లో అందరిని భయపెడుతుంది. సినిమా పాత్ర విషయం పక్కన పెడితే తెర వెనుక సూర్యకాంతం చాలా సున్నిత మనస్తత్వం కల వ్యక్తి. అయితే ఆ సూర్యకాంతానికి ఈ సూర్యకాంతం చిత్రానికి ఎటువంటి సంబంధం లేదట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో నిహారిక పాత్ర పేరు సూర్యకాంతం. ఇందులో ఈమె కొంచెం గడుగ్గాయిగా కనిపిస్తోందట. అందుకే ఈసినిమాకు సూర్యకాంతం అనే పేరు అనుకుంటున్నారట. ప్రస్తుతం నిహారిక నటించిన ‘హ్యాపి వెడ్డింగ్‌’ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది.