గాయత్రి మూవీ రివ్యూ

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster
Release Date
February 9, 2018

Critic Reviews for The Boxtrolls

గాయత్రి.. మోహన్ బాబు బాగున్నాడు కానీ!
Rating: 2.5/5

http://www.tupaki.com

కొన్ని ‘పొలిటిక‌ల్ పంచ్‌’ల కోసం…
Rating: 2.5/5

www.telugu360.com/te

నటప్రపూర్ణ వన్‌ మ్యాన్‌ షో!
Rating: 2.5/5

telugu.greatandhra.com

చిత్రం: గాయత్రి
నటీనటులు: మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్‌ తదితరులు
రచయిత: డైమండ్‌ రత్న బాబు
సినిమాటోగ్రాఫర్‌: సర్వేష్ మురారి
సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌
నిర్మాత: మోహన్‌బాబు
దర్శకత్వం: ఆర్.ఆర్‌ మదన్‌
మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘గాయత్రి’. ఈ సినిమాలో ఆయనతో పాటు మరో ముఖ్య పాత్రలో విష్ణు కనిపించడం విశేషం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం!
కథ: 
తనవాళ్ళందరినీ పోగొట్టుకొని ‘శారదాసదన్’ అనే అనాధాశ్రమాన్ని నడుపుతుంటాడు శివాజీ(మోహన్ బాబు). దానికి కావాల్సిన డబ్బుని సంపాదించడం కోసం మారువేషం వేసుకొని కోర్టులో శిక్ష పడిన వారి స్థానంలోకి వెళ్లి శిక్ష అనుభావిస్తుంటాడు. ఈ విధంగా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తాడు. ఇదే క్రమంలో గాయత్రి పటేల్(మోహన్ బాబు) అనే నిందితుడికి పడిన శిక్షను అనుభవించడానికి జైలుకి వెళ్తాడు. అయితే అతడికి ఉరిశిక్ష పడిందనే విషయం శివాజీకు తెలియదు. మరి తెలిసిన తరువాత జైలు నుండి బయటపడ్డాడా..? అసలు గాయత్రి పటేల్ ఎవరు..? అతడికి ఉరిశిక్ష ఎందుకు పడింది..? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్: 
మోహన్ బాబు నటన
రెండు పాటలు, నేపధ్య సంగీతం
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్: 
ఫస్ట్ హాఫ్
కామెడీ లేకపోవడం
విశ్లేషణ: 
చిన్నప్పుడే తప్పిపోయిన తన కూతురు కోసం వెతికే తండ్రి కథే ఈ సినిమా. తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషన్స్ ను బాగా చూపించారు. సెంటిమెంట్ కాస్త ఎక్కువయినప్పటికీ ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాడ్ లో ఎలాంటి కొత్తదనం ఉండదు. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. చివరి 40 నిముషాలు సినిమా భావోద్వేగాలతో సాగుతుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మోహన్ బాబు అధ్బుతంగా నటించారు. ఆయన నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. విష్ణు ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. తండ్రికొడుకులు ఒకే సినిమాలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. కథలో ఉన్న ట్విస్టులు ఆడియన్స్ ను మెప్పిస్తాయి. తమన్ అందించిన ‘ఒక నువ్వు ఒక నేను’ పాట మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా ఉంది. డైలాగులు, కెమెరా వర్క్ బాగున్నాయి. మాస్ ఆడియన్స్ సంగతి పక్కన పెడితే మల్టీప్లెక్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా కొంతవరకు నచ్చుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here