‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అథితిగా అల్లు అర్జున్‌

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’ ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ నిన్న (ఆదివారం) జరిగింది. కాగా ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్‌ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గీత గోవిందం చిత్రాన్ని చూశానని , సినిమా చాలా బాగుందని విజయ్ దేవరకొండ -రష్మిక మందన్నా నటన అద్భుతమని తెలిపారు. కాగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసిన తర్వాత తనకు వారం రోజులు నిద్ర పట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లు అర్జున్.
అయితే తన ఇప్పటిలో సినిమా చేయడం లేదని , తన కొత్త సినిమా గురించి నేను చెప్పేవరకు ఎవరూ అడగొద్దని అభిమానులను కోరాడు అల్లు అర్జున్ .

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాడిన పాట వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించడంతో పాటు… లిరిక్స్ మార్చి సినిమాలో పెట్టనున్నట్లు దర్శక నిర్మాతలు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఆడియో వేడుకలో ఈ వివాదంపై విజయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు విజయ్‌ దేవరకొండ.