‘గీత గోవిందం’ ఫస్ట్‌లుక్

విజయ్‌ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో “గీత గోవిందం” అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. గీత, గోవింద్‌ అనే యువ జంట ప్రేమకథ ఇది.”ఛలో” ఫేం రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పణలో ఈచిత్రం తెరకెక్కుతోంది. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. యువత మెచ్చే చక్కటి కథలతో వెండితెరపై సందడి చేస్తున్న హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. విజయ్‌ దేవరకొండ నేలపై కూర్చుని కాళ్లు గోడకు ఆన్చి పెట్టుకుని ఉంటే రష్మిక ఆయన కాళ్లపై దర్జాగా కూర్చుని చిరు నవ్వులు చిందిస్తూ ఫోజిచ్చింది. విజయ్‌ మాత్రం తన ప్రేయసిని చూసుకుని ఆనందపడిపోతున్నాడు. ‘నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుం నొప్పి లేచినా.. మీ బరువు, బాధ్యత ఎప్పుడూ నాదే మేడం’ అని నవ్వుతూ విజయ్‌ ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.